- Advertisement -
హిరో అల్లు అర్జున్ అరెస్టు
Hero Allu Arjun arrested
హైదరాబాద్
పుష్ప-2′ బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆ కేసుకు సంభందించి చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర ఘటన జరిగింది. అల్లు అర్జున్ అక్కడికి రాగానే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రెవతి అనే మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
- Advertisement -