ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్
High Court Issues Notices to Seven Defecting MLAs and the Telangana Assembly Speaker
ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసారు. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు లపై పిటిషన్ దాఖలయింది. కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలకు కోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణ వచ్చేనెల 16కు వాయిదా వేసింది.



