ఘనంగా రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం
హాజరైన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, వనస్థలిపురం, వాయిస్ టుడే: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని చంద్రా గార్డెన్స్ లో రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో మహిళలు ఇళ్ల నుండి బయటకు వచ్చేవారు కాదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అంతకుముందు మహిళలు, యువతులు ఉత్సాహంగా దాండియా ఆడారు. ఈ కార్యక్రమంలో భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్త, కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, రాజిరెడ్డి, మురుకుంట్ల అరవింద్ శర్మ, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, పార్వతి గౌడ్, శైలజ, అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, నిర్వాహకులు పాల్గొన్నారు.