- Advertisement -
హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య
Hijra leader Hasini was brutally murdered
నెల్లూరు
కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా లీడర్ హాసిని ని దారికాచి కత్తులతో పొడిచి దారుణ హత్య చేసారు. హసినిని చంపేందుకు దుండగులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం. గాయపడిన హాసినిని 108లో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హాసిని మృతి చెందింది. పార్లపల్లి గ్రామం లోని గుడిలో పూజలు నిర్వహించి.. తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. హాసిని కి తిరుపతి – నెల్లూరు జిల్లా ల్లో పెద్ద సంఖ్యలో అనుచర ట్రాన్స్ జండర్స్ వున్నారు.. కొడవలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -