Tuesday, January 13, 2026

స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హోం టౌన్’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హోం టౌన్’ ట్రైలర్ రిలీజ్, ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్

'Home Town' trailer released by star hero Vijay Deverakonda

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. హోం టౌన్  ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పిన విజయ్..వెబ్ సిరీస్ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.
హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంది. ఉపాధి కోసం సొంతూర్లను వదిలి వచ్చినా, ఆ జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేం. మళ్లీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. జ్యోతి ఫొటో స్టూడియో జీవనోపాధిగా ఉన్న రాజీవ్ కనకాల..తన కొడుకు శ్రీకాంత్ (ప్రజ్యల్ యాద్మ)ను విదేశాల్లో చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాడు. కానీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే ఓ సగటు మధ్య తరగతి కుర్రాడు, అతనికి చదువుల మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడే కుటుంబంలో సంఘర్షణ ఏర్పడుతుంది. తండ్రి కోరుకున్నట్లు  శ్రీకాంత్ విదేశాల్లో చదివేందుకు ఒప్పుకున్నాడా లేదా, కొడుకును విదేశాల్లో చదివించేందుకు మధ్య తరగతి తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఝాన్సీ, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు.
ఈ సిరీస్ కు దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫర్ కాగా…సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్