ఖైరతాబాద్ నవంబర్ 22 (వాయిస్ టుడే ): ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరా నగర్, సాగర్ సొసైటీలలో బుధవారం దానం నాగేందర్ గెలుపు కోసం ఇందిరానగర్ జవహర్ నగర్, సాగర్ సొసైటీ, కమలాపురి కాలనీలో పాదయాత్ర, నిర్వహించడం జరిగింది. మహిళ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు రెండు వేల మహిళలు ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కారు గుర్తుకే మన ఓటు, కేసిఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, డిఎన్ ఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటించి కారు గుర్తుకు ఓటు వేసి, దానం నాగేందర్ ను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో మంగళారపు లక్ష్మణ్ కడిగారి బోజిరెడ్డి, పెరుక కిరణ్, సునీల్, దీప, జ్యోతి, చంద్రకళ పలువురు మహిళా సోదరిమణులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
