Sunday, September 8, 2024

జర్నలిస్ట్ అని ఎలా గుర్తిస్తారు..

- Advertisement -

ఇళ్ల పట్టాలు….జర్నలిస్ట్ ల అందరికీ ఇస్తారా…కొందరికేనా…!

కొందరికి ఇస్తే మరి మిగితవల్లకు ఎలా…!వాళ్ళు జర్నలిస్ట్ లు కదా…

కొందరి పేత్తనం వలనే ఇలా జరుగుతుందా?

తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నే తప్పుదోవ పట్టిస్తున్నారా?

How do you identify as a journalist?
How do you identify as a journalist?

సెప్టెంబర్ 10,  హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో  పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్నపుడు జర్నలిస్టు లందరికీ పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశించారు  అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడ పట్టాలు ఇవ్వలేదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తరుణంలో కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని  జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇస్తున్నాం అని ఇపుడు స్ధానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అడ్లూర్ శివర్లో 527 సర్వే నంబర్ర్లో గల భూమి 3.20 గంటలకు ఆదివారం కొబ్బరికాయ కొట్టి జర్నలిస్ట్ లను సంతోష పరచారు. ఇప్పటికైనా వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ ప్లాట్స్ ఇస్తారా… లేదా… కొందరికేనా.. అందరికీ ఇవ్వాలంటే దాదాపుగా 8 నుండి 10 ఎకరాల భూమి కావాలి  కానీ 3.20ల బూమి చూపించి జర్నలిస్టులకు ప్లాట్స్ ఇస్తున్నాం అని చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టుగా ఉన్నదంట్లో ఎంత మంది జర్నలిస్టులకు ఇస్తారు అనేదైపైన చర్చ జరిగింది .సంస్థ ఇచిన ఐడీ కార్డ్ అనుసరించి సంస్థకు ప్రింట్ మీడియా కు అర్ ఎన్ ఐ ,  కేబుల్ ఛానల్స్,ఎలక్ట్రాన్ మీడియా, కు  ఐ &పి అర్  అనుమతులు ఉన్నాయా లేదా అని చూసుకొని దాని ఆధారంగానే అందరికీ కూడా ఇవ్వాలని జర్నలిస్టు నాయకుల డిమాండ్ . కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 150 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. కానీ మూడు ఎకరాలలో వాస్తవంగా 7500 గజాల జాగా మాత్రమే వస్తుంది . గతంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన కొందరు విలేకరులు మరొకసారి తామే లబ్ధి పొందాలని ఉద్దేశంతో మిగతా వారి పొట్ట కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరికి 100 గజాల జాగా ఇచ్చిన 75 మందికే సరిపోతుంది. కొందరు ఈ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తుంది. 150 మంది వర్కింగ్ జర్నలిస్టులను గతంలో లబ్ది పొందిన వారికే ఇచ్చి మిగితవరికి  2విడుతలో అనే ప్రస్తావన లేకుండా ఇవ్వాలనీ వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.  లేని పక్షంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నామని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్