Sunday, September 8, 2024

రామారావును వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమే అంటే ఎలా?

- Advertisement -

బ్రహ్మణికి పోసాని కౌంటర్

రాజమండ్రి, సెప్టెంబర్ 19:  ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్‌ కామెంట్లు చేశారు పోసాని కృష్ణ మురళి.. ఇదే సమయంలో.. ఆయన కోడలు నారా బ్రహ్మణి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలి.. చంద్రబాబు ఏడాది పాటు జైలులో ఉండి బయటకు వచ్చే టప్పుడు నిజాయతీగా వస్తే మాకు అభ్యతరం లేదన్నారు. చంద్రబాబు గతంలో 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు.. చంద్రబాబుకు దోమ తెరలు, ఏసీ ఏర్పాటుపై చర్చ సాగుతోన్న తరుణంలో.. చంద్రబాబుకు దోమలు కరుస్తుంటే.. దోమల మందు, ఏసీ, దోమల తెరలను నేను కొనిస్తా.. ఇచ్చిరండి అంటూ టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు.. ఇక, నారా బ్రహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ సెటైర్లు వేశారు.. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అని కౌంటర్‌ ఇచ్చారు.. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? మీ తాతయ్యను చంపిందెవరు ? బ్రహ్మణి చెప్పాలి అంటూ సవాల్‌ చేశారు పోసాని కృష్ణమురళి.ఏదిక్కైనా వెళ్లండి బాగుపడతారు.. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని సలహా ఇచ్చారు పోసాని.. రామారావును వెన్నుపోటు పొడిచావు ఒప్పుకోవు.. రామారావును చంపావు ఒప్పుకోవు.. రామారావును వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమే అంటే ఎలా? అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొన్నది కూడా ప్రజలకోసమేనా..? అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారు.. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా? జైల్లో ఉండి ర్యాలీలు.. ధర్నాలతో నీకేం పని అని నిలదీశారు. 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నావ్.. దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు లేవన్నారు పోసాని కృష్ణ మురళి.ఇక, ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 22వ నంది నాటకోత్సవలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొత్తం 115 ఎంట్రీలు వచ్చాయి.. అందులోంచి 38 ఫైనల్ కు ఎంపిక చేశారు.. 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రూటినీ చేశాం.. మొత్తం 73 అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. పద్యనాటకానికి రూ.50 వేలు, సోషల్ ప్లే కి రూ. 40 వేలు, సోషల్ ప్లే లెట్ లకు రూ. 25 వేలు, చిల్డ్రన్ ప్లే లెట్ లకు రూ. 25 వేలు, కాలేజీ యూనివర్సిటీ ప్లే లెట్ లు రూ. 25 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. సీల్డ్ కవర్ లో ఫైనలిస్టుల జాబితా తీసుకొచ్చి వారే చెపుతారు జ్యూరీలు.. ఫైనల్ కోసం ముగ్గురు జడ్జిలను గుర్తిస్తున్నాం అని ఏపీ చలనచిత్ర సినిమా టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్ధ చైర్మన్ పోసాని కృష్ణమురళి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్