Monday, February 23, 2026

ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

- Advertisement -

ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్

How many more years will BRS be robbed?
Union Minister Bandi Sanjay Kumar

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని గ్రానైట్ అసోషియేషన్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు

దోచిపెడతారని ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణం నుండి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారని

చెప్పాలన్నారు. గ్రానైట్ వ్యాపారుల నుండి  వెయ్యి కోట్లు తీసుకున్నట్లు నాపై కొందరు దుష్ప్రచారం చేస్తూ నిందలేసినా ఖండించలేదని అన్నారు.
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు తొలుత మానకొండూరు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తిరుపతి గౌడ్ తోపాటు మరికొందరు

నాయకులు ఎదురుపడ్డారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసియేషన్ నేతలు చెప్పారు. ఆ వెంటనే

సంజయ్ స్పందిస్తూ మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? గత 20 ఏళ్లుగా మీరంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారు. మీలో కొందరు వ్యాపారాల కోసం

రాజకీయాలను వాడుకుంటున్నరు. కొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటరు. వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తారు. మాలోంటోళ్లను ఓడగొట్టాలని చూస్తరు. అని చురకలంటించారు. గ్రానైట్

అసోసియేషన్ నుండి బండి సంజయ్ కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ఈ సందర్భంగా సంజయ్ వారి వద్ద ప్రస్తావించారు. ఏనాడైనా మీరు నాకు ఒక్క రూపాయి అయినా

ఇచ్చారా? నేను గెలిచిన తరువాత కూడా మీలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పించలేదు కదా. కానీ బయట మాత్రం కొందరు నాకు 700 కోట్ల రూపాయలు

ఇచ్చానని నిందలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండించలేదు. పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు దోచి పెట్టి  ఆ పార్టీని ఇంకా సాదుతున్నరు. కానీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు

రావడం లేదు. అని వ్యాఖ్యానించారు.
ఆ తరువాత అక్కడి నుండి చింతకుంట చెరువు వద్దకు వచ్చి గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతుండగా మల్లిఖార్జున మధుతో కలిసి కొందరు గ్రానైట్ వ్యాపారులు అక్కడిక వచ్చారు. మళ్లీ వాళ్లను

ఉద్దేశించి గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదు. బయటకు పోయి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణాల నుండి సభ్యత్వం

పేరుతో ఒక్కో దుకాణం నుండి రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల దాకా గ్రానైట్ అసోసియేషన్ వసూలు చేసింది. దాదాపు 350 నుండి  500 షాపుల దాకా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉంది.  మరి ఆ

సొమ్మును ఏం చేశారు? సమాజానికి ఏమైనా సేవ చేశారా? గణేశ్ పండుగ సందర్భంగా గల్లీగల్లీలో గణేష్ మండపాలు పెడతారు. కనీసం తట్టెడు మట్టి పోశారా? కరెంట్ బిల్లులైనా కట్టారా? అధికారులు, పోలీసులు

సొంతంగా ఖర్చు పెట్టుకుని తిండి తింటూ రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తారు. అట్లాంటి వాళ్లకు భోజన, మంచి నీళ్ల సదుపాయాలైనా కల్పించారా? అవేమీ చేయరు. మరి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? తీస్తా.

ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తా..అని అన్నారు. దీంతో ఖంగుతిన్న  దీంతో ఖంగుతిన్న గ్రానైట్ అసొసియేషన్ నాయకులు సమాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను

ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే మోదీకి సైతం థ్యాంక్స్ చెబుతామని, గ్రానైట్ అసోసియేషన్ పేరుతో సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ఎవ్వరికీ పైసలు

ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ ముందుకు సాగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్