Thursday, December 26, 2024

బీఆర్ఎస్ లో మిగిలేది ఎంత మంది

- Advertisement -

బీఆర్ఎస్ లో మిగిలేది ఎంత మంది
హైదరాబాద్,  జూలై 17

How many people are left in BRS?

బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఎంత మంది? ఒకప్పటి అదే బీఆర్ఎస్‌ నేత అయిన దానం నాగేందర్ మాటల్లో చెప్పాలంటే.. ముగ్గురు లేదా నలుగురు. ఈ ఫిరాయింపులకు సంబంధించి న్యాయపోరాటం చేసుకోండని ఆయన సవాల్ కూడా విసురుతున్నారు. ఆయన ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేత ఇంత ఘాటుగా రియాక్ట్ అవ్వడానికి రీజనేంటి? సింపుల్.. ఆత్మగౌరవం దెబ్బతినడం. ఎమ్మెల్యేలమైనా మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు. ఓ చీడ పురుగును చూసినట్టు చూశారు. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. నిజానికి పరిస్థితులు చూస్తుంటే ఆయన మాటలు నిజమయ్యేలానే ఉన్నాయి.మరికొన్ని గంటల్లోనే గ్రేటర్‌ ఏరియాలోని అన్ని నియోజకవర్గాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా బీఆర్ఎస్‌ పార్టీ మీటింగ్స్‌కు మొఖం చాటేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి మీటింగ్‌కు కూడా డుమ్మా కొట్టారు.దీంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బలా నేతల వలసల షాక్‌ తగులుతోంది. ఇప్పుడు జరగబోయే పరిణామాలను చూసేందుకు బీఆర్ఎస్‌ పెద్దలు గుండెను రాయి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ నెలాఖరు వరకు ఈ చేరికలను పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ టార్గెట్.. ఆలోపు బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్‌ ఆలోచన. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అంతకుముందే కాంగ్రెస్ ఈ టార్గెట్‌ను రీచ్‌ అయ్యేలా కనిపిస్తోంది.కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి..సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్.. ఈ లిస్ట్‌లో ఉన్న ఒకరిద్దరు తప్ప.. అందరి దారి కాంగ్రెస్‌ వైపే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తలసానికి కూడా పార్టీలో చేరమని రాయబారం వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల నాటికి గ్రేటర్‌ ఏరియాలో బలపడాలన్నది కాంగ్రెస్ ఆలోచన.. పరిణామాలు చూస్తుంటే బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఇది గ్రేటర్ విషయం.. ఇక స్టేట్‌వైడ్‌గా చూసుకుంటే.. బీఆర్ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేలలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.. అందుకే అడుగులు వేగంగా వేస్తోంది. అయితే ఈ చేరికలపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. స్పీకర్‌కు లేఖలు రాస్తూ.. కోర్టులను కూడా ఆశ్రయిస్తుంది. బట్ ఎలాంటి ఫలితం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్‌ఎల్పీ విలీనమవుతుందన్న క్లారిటీ వచ్చింది. దీంతో ఎలాంటి భయం లేకుండా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు.పార్టీ ఆపద సమయంలో ఉంటే కనీసం కాపాడుకోవడానికైనా ప్రయత్నించాల్సిన పెద్దలు.ఒకరు ఫామ్‌హౌస్‌కే పరిమితం కాగా.. మరో ఇద్దరు ఢిల్లీలో కవిత బెయిల్‌ కోసం కాళ్లబేరాలు, రాయబారాలతో బిజీగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌కు పని మరింత ఈజీగా అయిపోయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్