Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మీ నగరంలో లీటర్ ఎంతంటే..?

- Advertisement -

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు..మీ నగరంలో లీటర్ ఎంతంటే..?

ప్రభుత్వ చమురు కంపెనీలు బుధవారం అంటే ఏప్రిల్ 10 వ తేదికి సంబంధించి పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేసాయి. ఈరోజు వాటి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని నగరాల్లో వాటి ధరలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో వాహనం ట్యాంక్ నింపే ముందు తాజా ధరను తనిఖీ చేయడం మంచిది. ఇప్పుడు ఢిల్లీ నుండి చెన్నై వరకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76 గా, డీజిల్ ధర రూ.87.66 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.19 గా , డీజిల్ ధర రూ.92.13 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93, డీజిల్ ధర రూ.90.74గా ఉంది.
చివరికి చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 వద్ద, డీజిల్ ధర రూ.92.32 వద్ద కొనసాగుతోంది.

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

నోయిడా లో లీటరు పెట్రోలు రూ.94.81 గా, డీజిల్ రూ.87.94 గా ఉంది. గురుగ్రామ్ లో లీటరు పెట్రోలు పై రూ.95.18, డీజిల్ పై రూ.88.03 ఉంది. బెంగళూరు నగరంలో లీటర్ పెట్రోల్ రూ.99.82 గా, డీజిల్ రూ.85.92 గా ఉంది. చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.94.22 గా, డీజిల్ రూ.82.38 గా ఉంది. తెలుగు రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై రూ.107.39 గా, డీజిల్ రూ.95.63 గా ఉంది. జైపూర్ లో లీటరు పెట్రోలు రూ.104.86 గా, డీజిల్ రూ.90.34 గా ఉంది. పాట్నా లో లీటర్ పెట్రోల్ రూ.105.16 గా, డీజిల్ రూ.92.03 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.94.63 వద్ద, డీజిల్ రూ.87.74 వద్ద కొనసాగుతోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!