పూసాలలో సంక్రాంతి సంబరాలు శిఖరానికి
— ముగ్గుల పోటీలతో ఉత్సాహం, మేకల కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు
సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా జనవరి-16 వాయిస్ టుడే :
Huge additions to BJP under Mekala Kiran Yadav
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల పద్నాలుగవ వార్డ్ లోని బిజెపి నేత మేకల అమల కిరణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన, జిల్లా కార్యవర్గ సభ్యులు వేగోళం శ్రీనివాస్ గౌడ్ పరిశీలనలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి హాజరై, అలాగే మేకల అమల కిరణ్ కుమార్ యాదవ్ తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీ మాజీ డైరెక్టర్ లు , వివిధ పార్టీల నాయకులు, యువకులు మేకల రాజయ్య యాదవ్, నల్ల ప్రసాద్ నేత, మేకల సంతోష్ యాదవ్, అగండ్ల శంకర్, అగండ్ల శ్రీను, నల్ల సాయి, మేకల రాజ్ కుమార్, పిట్టల శ్రీధర్, కమ్మరి సాయి కుమార్, వల్స కిరణ్, బండి సంపత్, బేజ్జంకి ఒదేలు యాదవ్, మేకల విష్ణు, చింతల కార్తిక్ లతో పాటు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో,
మేకల కిరణ్ యాదవ్ సమక్షంలో అధికారికంగా బిజెపి కండువా కప్పి బిజెపి పార్టీలోకి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవ రెడ్డి స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మకర సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి తెలియజేస్తూ మన సంస్కృతుల్ని పండుగల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సంక్రాంతి లాంటి పండుగలు వస్తే ఎంతో సంప్రదాయ బద్ధకంగా ఉంటుందని, హిందువులు ఐక్యంగా ఉండాలని కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వలో బిజెపి అన్ని రాష్ట్రాలలో బలపడుతుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుచుకుంటారన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి నల్లా అనూష, రెండవ బహుమతి వేగోళం రజిని, మూడవ బహుమతి ఉస్తేం ఉమ, నాలుగో బహుమతి చింతల అనుష, ఐదవ బహుమతి నల్ల మౌనిక లకు, బహుమతులు ప్రధానం చేశారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ ఉస్తేం లక్ష్మీనారాయణ, నలభై వేల రూపాయలు వేల విలువగల వంద చీరలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పూసాల మాజీ సర్పంచ్ లంక శంకర్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, నాగుల మల్యాల తిరుపతి, జిల్లా మన్కిబాత్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, వాణిజ్య సేల్ కన్వీనర్ ఎల్లంకీ రాజు, సోషల్ మీడియా కన్వీనర్ వెంకట కృష్ణ, జిల్లా ఎస్టీ మోర్చా అరుణ్ రంజా, పట్టణ నాయకులు పల్లె తిరుపతి, ఎనగందుల సతీష్, కందునూరి కుమార్, గుడ్ల వెంకటేష్, మెండ శంకరయ్య, చిట్టవేణి సదయ్య, శేఖర్ మాస్టర్, వల్స సాయికిరణ్, కంకణాల సతీష్, ఈశ్వర్, దేశెట్టి శ్రీకాంత్, గట్టు రాము, శశివర్ధన్ తో పాటు అధిక సంఖ్యలో మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


