హైందవ శంఖారావానికి భారీ ఏర్పాట్లు
Huge arrangements for Hyndava Sankharava
అమరావతి
విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సభావేదిక, సాంస్కృతిక వేదికతోపాటు ఐదు బ్లాక్‌లలో యాభై గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం పరిసరాల్లో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కాషాయ జెండాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యఅతిథులుగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్‌కుమార్, అయోధ్య రామమందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మ తదితరులతోపాటు రాష్ట్రంలో 150 మంది స్వామీజీలు పాల్గొననున్నారు. 30 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించారు. పార్కింగ్ నుంచి సభకు చేరుకునే మార్గంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంగణంలో 50 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. సభను 50 గ్యాలరీలుగా విభజించారు. మొత్తమ్మీద 3,500 మంది ప్రబంధకులు విధుల్లో ఉంటారు. ముందు రోజు వచ్చే వారికి ఉప్పులూరు రైల్వేస్టేషన్ వద్ద వసతి ఏర్పాటు చేశారు. 40 నుంచి 50 వేల మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేదికపై ధార్మిక సంస్థ ప్రతినిధులు, స్వామీజీలే ఉంటారు. రాజకీయ నాయకులు గ్యాలరీలకే పరిమితం కానున్నారు.