Thursday, May 14, 2026

పెండింగ్ చలాన్ల పై మరోసారి భారీ డిస్కౌంట్

- Advertisement -
Huge discount once again on pending challans

పెండింగ్ చలాన్ల పై మరోసారి భారీ డిస్కౌంట్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  పోలీసుశాఖ
హైదరాబాద్ డిసెంబర్ 22
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల పై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీసుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను త్వరగా చెల్లించేందుకు వాహనదారులకు రాష్ట్ర పోలీసులు బారీ రాయితీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్‌తో కట్టవచ్చని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్, టూవీలర్ చలాన్లకు 80 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌తో పాటు మీసేవ సెంటర్స్‌లో డిస్కౌంట్‌లో చలాన్స్ పేమెంట్ చేసే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలు అయ్యాయి. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు డబ్బులు సరిగా వసూలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చలాన్లు భారీగా పెరిగిపోతుండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్