- Advertisement -
పాకిస్తాన్ రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 24మంది మృతి
Huge explosion in Pakistan railway station.. 24 people died
పాకిస్తాన్ నవంబర్ 9
పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా..మరో 40 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ప్లాట్‌ఫాం నుంచి పెషావర్ కు రైలు వెళ్లున్న సమయంలో పేలుడు జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(SSP) మహ్మద్ బలోచ్ మాట్లాడుత. ఈ సంఘటన “ఆత్మహుతి బాంబు పేలుడు”గా అని అనిపిస్తుందని చెప్పారు. అయితే ఇది ఖచ్చితంగా చెప్పడానికి అప్పుడే నిర్దారణకు రాలేమని, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
- Advertisement -