- Advertisement -
భారీగా పెరిగిన యాదాద్రి హుండీ ఆదాయం
యాదాద్రి
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత 28 రోజులకు గానూ ఆలయ హుండీ ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 28 సాధారణ రోజుల్లో ఆలయ ఖజానాకు హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు.
- Advertisement -