కరీంనగర్ జిల్లా:అక్టోబర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజవర్గం నుంచీ మరోసారి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఆయన.. ఇక్కడ ఓటమి లేకుండా, విజయం సాధిస్తూ వస్తున్నారు.
మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటారు.
అయితే, ఈటెలతో పాటు.. ఆయన సతీమణి జమునా రెడ్డి.. ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. సుమారుగా మూడు నెలల పాటు. ప్రచారం చేసి. వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈటెలకు ప్రాణహానీ ఉందనే విషయాన్ని కూడా జనం దృష్టికి తీసుకువచ్చారు.
అ క్రమంలోనే పూర్తిగా హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను జమునా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఎక్కువగా గజ్వేల్‌పై దృష్టి పెట్టుకున్నారు. అక్కడ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననే ఇది వరకు ప్రకటించారు. ఇటీవల హుజురాబాద్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా నేతలు, కార్యకర్తలు కథ నాయకురాలిగా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలను జమునా తీసుకుంటున్నారు.
హుజురాబాద్ నియోకవర్గంలో అందరి నేతలతో జమునాకు పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా…. వివిధ సమావేశాల్లో కూడా మాట్లాడిన అనుభవం ఉంది. అదే విధంగా భూముల వ్యవహారంలో కూడా జామున మాట్లాడారు. బీఆర్ఎస్ వీడిన తరువాత ఈటెలతో అన్ని సమావేశాల్లో జమునా పాల్గొంటున్నారు. ఇటీవల జమ్మికుంటకు.. రాజ్ నాథ్ సింగ్ వచ్చిన సమయంలో కూడా వేదికపై ఉన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరో రెండు మూడు రోజుల్లో హుజురాబాద్‌లోనే ఉంటూ ప్రచారం చేయాలని ఫ్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది..