- Advertisement -
దుర్గమ్మ వారి దేవాలయంలో హుండీ చోరి
Hundi was stolen from Durgamma's temple...
కర్లపాలెం
బాపట్ల
కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో కొలువైయున్న కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కానుకల హుండీ చోరీకి గురైంది. గత రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దేవాలయం ఆవరణలో ఉన్న కానుకల హుండీ మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహం మెడలోని బంగారపు మంగళ సూత్రములు సుమారు రెండున్నర సవర్లు చోరీకి గురయ్యాయి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చి పరిశీలించేసరికి హుండీ చోరీకి గురికావడం కలకలం రేపింది అంతేగాక అమ్మవారి దేవాలయం చెందిన తాళం పగలగొట్టి అమ్మవారి మెడలోని బంగారు సూత్రములు చోరీకి గురయ్యాయి దేవాలయానికి సుమారు కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో కానుకల ఉండి పగలగొట్టిన ఆనవాళ్లు కనిపించాయి ఈ విషయంపై గ్రామస్తులు కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -




