ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాది మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడి మోసపోయారు. భారీ లావాదేవీలు ఆశ చూపించి పెట్టుబడి పెట్టించుకుని ఓ పే యాప్ కేటుగాళ్లు అమాయకులను లక్షల్లో దోచుకున్నారు. మొదట్లో తక్కువ మొత్తంలో లాభాలు ఇచ్చి తర్వాత పెద్ద మొత్తంలో దండుకొని యాప్ ను మూసేశారు. రాష్ట్రంలో అక్కడక్కడా వినిపించే ఈ యాప్ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది ఏకంగా ఓ గ్రామమే సైబర్ ఉచ్చులో కూరుకుపోయింది. వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం మహ్మదాన్ పల్లి వాసులు పేయాప్ ఉచ్చులో పడి లక్షల్లో నష్టపోయారు. యువత చిరు వ్యాపారస్తులు ఉద్యోగస్తులనే టార్గెట్ చేస్తూ సైబర్ కేటగాళ్లు లక్షల్లో దోచుకున్నారు. మొదటి రోజు వేలల్లో లాభం ఖాతాల్లో ఎర వేసి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో పెట్టుబడి పెట్టించారు. గ్రామం నుంచి పేయాప్ పెట్టుబడితో ఏకంగా 80 లక్షల వరకు మోసపోయి లబోదిబోమంటున్నారు. గ్రామంలో రూ 3 వేల నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు 100 మంది వరకు ఉన్నారు. యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయామని చెప్పుకుంటే తమకే సిగ్గుచేటు అని కొందరు బయటకు చెప్పడం లేదు మరికొందరు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు….03:04 PM