విశాఖ జిల్లాలో దారుణం
భార్యపై అనుమానంతో బ్లేడు తో విచక్షణా రహితంగా భర్త దాడిచేసి గాయపరిచాడు. విశాఖ జిల్లా ఆరిలోవ సిఐ సోమ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ప్రసాదు, వాసుపల్లి నీలిమ వీరు ఇరువురు భార్య భర్తలు. వీరి ఇరువురు మధ్య మనస్పర్థలు కారణంగా భార్య నీలిమ ఆరిలోవ టిఐసీ పాయింట్ వద్ద నివసిస్తోంది. భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ వీరు పూర్ణా మార్కెట్ లో నివసిస్తూవుంటారు. ఈ క్రమంలో బుధవారం భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ ఆరిలోవ వచ్చి తన భార్య నీలిమను మాట్లాడాలని బయటకు పిలిచి గొడవకు దిగాడు. భర్త వాసుపల్లి ప్రసాదు తన వెంట తీసుకొచ్చిన బ్లేడు తో భార్య నీలిమను విచక్షణా రహితంగా గాయపరిచాడు. మెడ పైన,మొహంపైనా బ్లేడుతో గాయపరిచినట్లు సిఐ తెలిపారు. భార్య నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ప్రసాదు, అత్త ముత్యాలమ్మ ఇరువురుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేసారు. ఎస్సై సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.