ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్
Hyderabad Commissioner Conducts Field Inspection of Prajavani Complaints
ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటిఘనాపూర్ విలేజ్ ఆనందనగర్ లేఔట్లో రహదారులు, పార్కులతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. 1980 వ సంవత్సరం 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో గ్రామపంచాయతీ అనుమతి పొందిన లేఔట్ వేశారు. ఇందులో కొన్ని ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చింది. ఆనందనగర్ కాలిని పేరిట ఉన్న లేఔట్ హద్దులను చెరిపేసి వ్యవసాయ భూమిగా చిత్రించారు. ధరణి ద్వారా పాస్ బుక్స్ సృష్టించి కబ్జా కి పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. లేఅవుట్లో ప్లాట్లు ఉన్న బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆక్రమణలు జరిగిన తీరును కమిషనర్ కు వివరించారు. లే అవుట్ ప్రకారం పార్కులు, రహదారులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.



