Hyderabad – Goa new train.. two days a week..
హైదరాబాద్ నుంచి నుంచి గోవాకు మరోరైలును అందుబాటులోకి తీసుకోస్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు.. సికింద్రాబాద్- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ రైలు వారానికి రెండు రోజులు సేవలు అందిస్తుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్ర వారాల్లో ఈ రైలు బయలుదేరుతుండగా.. గోవా నుంచి గురు, శని వారాల్లో బయలుదేరుతుంది. అయితే అక్టోబర్ 6వ తేదీన ఈ రైలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. రెగ్యులర్ సర్వీసులు మాత్రం అక్టోబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
ఇదిలాఉంటే, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు కొన్ని రైళ్లు ఉన్నప్పటికీ.. అందులో టికెట్లు దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైల్వే శాఖ మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకోస్తుంది.
సికింద్రాబాద్- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైల్లో స్లీపర్, థర్డ్ ఎకానమీ, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల జంక్షన్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్ జంక్షన్, బల్లారి జంక్షన్, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్లీ, ధార్వాడ్, , క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డామ్, మడగావల్ స్టేషన్లలో ఆగుతుంది.
సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్..
>> ఈ రైలు (17039) ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది.
>> ఈ రైలు (17040) ప్రతి గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు ఇలా..
>> సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్‌లో రూ. 440, థర్డ్ ఎకానమీలో రూ. 1,100, త్రీ టైర్ ఏసీలో రూ. 1,185, టూ టైర్ ఏసీలో రూ. 1,700, ఫస్ట్ ఏసీలో రూ. 2,860గా ఉన్నాయి.
>> కర్నూలు టౌన్ నుంచి వాస్కోడిగామాకు టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్‌లో రూ. 350, థర్డ్ ఎకానమీలో రూ. 870, త్రీ టైర్ ఏసీలో రూ. 950, టూ టైర్ ఏసీలో రూ. 1,355, ఫస్ట్ ఏసీలో రూ. 2,255గా ఉన్నాయి.