హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరణ*
*ప్రెస్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ గా మార్చి తీరుతాం*-కొత్త కార్యవర్గం హామీ*
Hyderabad Press Club’s new governing body assumes charge*

– హైదరాబాద్, అక్టోబర్, 31:
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ 2025- 2027 నూతన కార్యవర్గం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టింది. గత ఆదివారం జరిగిన ఎన్నికలలో ఫ్రెండ్స్ ప్యానల్ ఘన విజయం సాధించింది. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ వరికుప్పల,ఉపాధ్యక్షులుగా అరుణ అత్తలూరి, ఏ .రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా చిలుకూరి హరి ప్రసాద్, బాబురావు. వి, ట్రెజరర్ గా రమేష్ వైట్ల బాధ్యతలు చేపట్టారు.ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్ .ఉమాదేవి, మర్యాద రమాదేవి, రాజేశ్వరి కళ్యాణం ,శంకర్ శిగ, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు వనం, శ్రీనివాస రెడ్డి, రచన ముడింబి , అశోక్ దయ్యాల, సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, అమిత్ భట్టు బాధ్యతలు స్వీకరించారు. ఏపీప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ సమక్షంలో పాత పాలకమండలి మినిట్స్ బుక్ ను నూతన కార్యవర్గానికి అందజేసింది.ఈఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కొండ శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులకు ఎన్నికైనసర్టిఫికెట్లను ప్రధానం చేశారు.తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక క్లబ్ గా పేరున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం పని చేయాలని నూతన పాలకమండలికి సీనియర్ పాత్రికేయులు సూచించారు.తమపై ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పనిచేస్తామని నూతన పాలకమండలి ప్రకటించింది. ఎన్నికల వరకే వేరువేరు ప్యానల్స్ అని ఎన్నికలు ఎన్నికలు ముగిశాక పోటీ చేసిన వారందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని నూతన పాలకమండలి తెలిపింది. ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాల్ నాయుడు ఆర్ రవికాంత్ రెడ్డిలు తమ బాధ్యతలను కొత్త కమిటీకి అప్పగించారు. ఆరు దశాబ్దాల చరిత్ర గల ప్రెస్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మార్చడంతో పాటు సభ్యులకు ఇచ్చిన హామీలన్నింటిని నిలుపుకుంటామని నూతన పాలకమండలి ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. నవంబర్ లో ఫ్యామిలీ గెట్ టు గెదర్ నిర్వహించడంతోపాటు వివిధ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పాలకమండలి ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ , రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సురేందర్, జనం సాక్షి అధినేత రెహమాన్, సీనియర్ పాత్రికేయులు, సీ.జీ.కే మూర్తి సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు బి.కిరణ్, హాష్మీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
*హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా హ్యాట్రిక్స్ సాధించిన చిలుకూరు హరిప్రసాద్*
. ……… హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా చిలుకూరి హరిప్రసాద్ ఘనవిజయం విజయం సాధించారు. సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వరుసగా మూడోసారి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. టీవీ9 లో న్యూస్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న చిలుకూరి హరిప్రసాద్ మూడు దశాబ్దాలకు పైగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొనసాగుతున్నారు. ఉదయం దినపత్రికలు అతను జర్నలిజం ప్రారంభించిన హరిప్రసాద్ ఆంధ్రప్రభ, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఆయన సిటీ కేబుల్, మా టీవీ న్యూస్, తర్వాత టీవీ9 లో న్యూస్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మొదటిసారి ఈసీ మెంబర్ గాను, వరుసగా మూడు పర్యాయాలు జాయింట్ సెక్రటరీగా ఘనవిజయం సాధించారు. ఈనెల 26 ఆదివారం జరిగిన ఎన్నికల్లో వెయ్యి మంది పైగా ఓటు వేయగా 600 ఓట్లు సాధించి జాయింట్ సెక్రెటరీ గా హ్యాట్రిక్ విజయం సాధించారు.


