Monday, March 24, 2025

 ఇక హైదరాబాద్ టూ శ్రీ శైలం… హ్యాపీ జర్నీ

- Advertisement -

 ఇక హైదరాబాద్ టూ శ్రీ శైలం… హ్యాపీ జర్నీ
కర్నూలు, మార్చి 6, (వాయిస్ టుడే)

Hyderabad to Sri Sailam... Happy journey

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. ఈ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి.. నల్లమల ఫారెస్ట్ అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లనుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగ్‌ల కారణంగా.. వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రాజెక్ట్ వివరాలు..
హైదరాబాద్‌ టు శ్రీశైలం రోడ్‌ వయా నల్లమల ఫారెస్ట్‌
మొత్తం 62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో ఈ కారిడార్‌ నిర్మించనున్నారు.
ఈ రహదారి నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా
నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు కారిడార్‌ వెళ్తుంది.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ప్రత్యేక ఆకర్షణగా ఐకానిక్ వంతెనను కూడా నిర్మించనున్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరం.
వన్యప్రాణులకు ఇబ్బందులు లేకుండా.. వృక్ష సంపదకు నష్టం కలుగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు పూర్తయి.. అందుబాటులోకి వస్తే.. ప్రయాణ ఇబ్బందులు దూరం
ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తులో ఉండే కారిడార్‌ వల్ల.. ఆ నిషేధాన్ని ఎత్తివేయవచ్చు.
30 అడుగుల ఎత్తులో కారిడార్‌ ఉండడం వల్ల.. వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత కలుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాంతం రవాణా, పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్‌ కారిడార్‌ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఫ్లైఓవర్‌ మధ్యలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీశాఖ సూచించింది. లైటింగ్‌ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్‌ కారిడార్‌పై రాత్రివేళ తక్కువ లైటింగ్‌ పెట్టాలని, నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. మొత్తంగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లేవాళ్లతో పాటు, ఏపీకి వెళ్లేవాళ్లకు కూడా ఈ కారిడార్‌ వల్ల సమయం కలిసి వస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్