- Advertisement -
ఈదులకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
Hydra Commissioner who inspected Idulakunta pond
హైదరాబాద్
ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సర్వే రిపోర్ట్ లతో పాటు, పూర్తి డాక్యుమెంట్లు పరిశీలిస్తామని వెల్లడించారు. అక్రమణకు గురవుతున్న ఖానామెట్ లో ఈదులకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ, హైడ్రా అధికారులతో కలిసి మరోసారి పరిశీలన చేసారు. గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సీపీఎం నాయకుల ఫిర్యాదు చేసారు. ఈ నేపద్యంలో ఈదులకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథక పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఖానామెట్ సర్వే నెంబర్ 7 లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో చెరువువుండగా ఓ రియలేస్టేట్ సంస్థ చెరువును పూడుస్తున్నారని సీపీఎం నాయకులు ఫిర్యాదు చేసారు. దాంతో అయన విలేజ్ మ్యాప్ ను పరిశీలించారు. ఈదులకుంట చెరువు ఏ మండల పరిధిలోకి వస్తుంది. ఓవర్ ల్యాపింగ్ ఎలా అయింది. గతంలో చేసిన సర్వే వివరాలపై ఆరా తీసారు,.
చెరువులో ఎవరు నిర్మాణం చేపట్టారు. వారికి ఉన్న రికార్డులు ఎంటనేది కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను అడిగారు. నిర్మాణదారులకు ఉన్న డాక్యుమెంట్లు, గతంలో సర్వే చేసిన రిపోర్ట్ లను పున పరిశీలిస్తామన్నారు. చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటం. ఈదులకుంట చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తాం. శేరిలింగంపల్లి మండలంలోనే అత్యధిక చెరువులు కబ్జాల పాలయ్యాయి. ప్రతీ చెరువును కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
- Advertisement -