Sunday, February 22, 2026

*కూకట్ పల్లి నల్ల చెరువులో నేడు హైడ్రా కూల్చివేతలు!*

- Advertisement -

*కూకట్ పల్లి నల్ల చెరువులో నేడు హైడ్రా కూల్చివేతలు!*

*Hydra demolitions in Kookat Palli black lake today!*

*హైదరాబాద్:సెప్టెంబర్ 22*

 

హైదరాబాద్ మహా నగరం లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. కొద్దిరోజులగా కూల్చివేత లకు దూరంగా ఉన్న హైడ్రా బృందం.. ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టారు.

 

దీంతో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేసినవారి గుండెల్లో దడ మొదలైంది. ఉదయాన్నే కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రాంతానికి చేరుకున్న హైడ్రా బృందం.. చెరువు భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమణ నిర్మాణా లను కూల్చివేస్తున్నారు.

 

నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి మోహరించారు.కూకట్ పల్లి లోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది.

 

బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవ నాలు, 16 షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 16షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది.

 

అయితే, ప్రజలు నివాసం ఉండే నిర్మాణాలపై త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తరువాత చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అపార్ట్ మెంట్లు, ఇళ్లపై హైడ్రా కొరడా ఝుళిపించే అవకాశం ఉంది.

 

అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జిల్లా పరిధిలోని అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేట్ పరిధిలోని సర్వే నెం. 164లో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.

 

రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశంలో హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నా రు. హైడ్రాకు చట్టబద్దతతో సర్వాధి కారాలు కల్పించా లని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

 

ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిర క్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రా మరింత దుకుడు పెంచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్