ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య
*యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
భువనగిరి (వాయిస్ టుడే ప్రతినిధి):- ఆలేరు నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య ని ఎఐసిసి,పిసిసి ప్రకటించడం తో యాదగిరిగుట్ట లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. ఉదయం తన స్వంత గ్రామమైన సైదాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత,పారుపల్లి గ్రామంలో,తూర్పుగుడెం గ్రామంలో,అలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీశ్రేణుల ను కలిశారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బీర్ల ఐలయ్య కి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
యాదగిరిగుట్ట కు చేరుకున్న బీర్ల ఐలయ్య కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి బాణసంచా కాల్చి,శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట పార్టీ కార్యాలయంలో సుమారు 700మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ లోకి చేరిన గ్రామాల్లో తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్,ధర్మారం వెంకటాపురం బొమ్మలరామారం మండలం,సోలిపేట,ప్యారారం,గుండాల మండలం మరిపడిగే,మోటకొండూరు మండలం నాంచారి పేట,గ్రామాల నుండి పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అసెంబ్లీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నియోజకవర్గ అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసారి నన్ను ఆశీర్వదించి ఆలేరు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.



