ఉపఎన్నికల్లో నన్ను కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండు…
ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉంది….
బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారు.
ఈటల రాజేందర్
హుజురాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్. డప్పులు హారతులతో స్వాగతం పలికిన గ్రామస్థులు. వీరతిలకం దిద్దిన మహిళలు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ గారు హామీ ఇచ్చారు. దీన్ని తెలంగాణ అంతా అందిపుచ్చుకోవాలి. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుంది అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం. సొంత ఇంటికల నిజం చేస్తామన్నారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా, ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ అందజేస్తాము. రైతు కూలీలులకు కూడా 5 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.. మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు బిజెపి ప్రభుత్వాన్ని భరిస్తుంది అన్నారు. ఒక్క కేజీ తరుగులేకుండా ధాన్యం కొనుగోలుచేస్తాము. మొత్తం దేశంలో బెల్ట్ షాపులు పెట్టి తాగిపించడంలో తెలంగాణ నంబర్ వన్. మద్యం మీద ఆదాయం 10,700 కోట్లు ఉంటే 45 వేల కోట్లు అయ్యింది. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారు.

కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నీకు ఉన్న అప్పు మాత్రమే అప్పు కాదు.. ప్రభుత్వ అప్పు కూడా నీ తలకు పడుతుంది. తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుంది. ఉపఎన్నికల్లో నన్ను కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండు. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేను. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉంది. కంచే చేనును మేసింది. కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు. కేసీఆర్ కు ఓటు వేసినందుకు మాభూములు గుంజుకున్నారు అని గజ్వేల్ వారు ఆవేదన చెందుతున్నారు. ఆవేదన తీర్చేందుకే కేసీఆర్ ను ఓడించడానికి వెళ్తున్నాను. నిరుద్యోగుల చావులుఆపుతాను. పెన్షన్ ఇస్తే సంబర పడుతున్నాము. పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విషయం మర్చిపోతున్నాము.



