- Advertisement -
CM KCRపై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని… కచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ MLA ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో జరగనున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాల్ పై ఆయన స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసి, అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ ను ఓడించటమే తన లక్ష్యమని చెప్పానని అన్నారు. ఆ మేరకే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు చెప్పారు
- Advertisement -