నాకు ఫీవర్,విచారణకు హాజరు కాలేను:నటి హేమ*

హైదరాబాద్:మే 27
బెంగుళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో తేలినవారికి విచారణకు రావాలని ఇప్పటికే పోలీ సులు నోటీసులు ఇచ్చారు.
నోటీసులు అందుకున్న వారి లో నటి హేమకూడా ఉన్నా రు. హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవా ళ్లు ఉన్నాయి.
దీంతో సోమవారం విచా రణకు హాజరుకావాలని బెంగళూరు పోలీసులు హేమకు గత మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. అయితే, తాను విచారణకు హాజరుకాలేనని హేమ పోలీసులకు సమా చారం ఇచ్చారు.
తాను వైరల్ ఫివర్ తో బాధపడుతున్నట్లు బెంగళూరు సీసీబీకి ఆమె లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఆ లేఖలో కోరారు.
హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి ఆమెకు నోటీసులు పంపించేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు…




