పేదలకు సేవ చేయడమే నాకిష్టం: పుల్లూరి ఉపేందర్ గుప్త
I love to serve the poor people : Pulluri Upender Gupta
విద్యార్థినుల చదువులకు పుల్లూరి ఉపేందర్ గుప్త ఆర్థిక సహాయం
విద్యార్థినులకు రూ.20వేల అందజేత
ఎల్బీనగర్:
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీకి చెందిన కరాటే మాస్టర్ తీగల శ్రీనివాస్ కిడ్నీలు చెడిపోయి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ బంజారా-320డీ రీజియన్ చైర్ పర్సన్ లయన్ పుల్లూరి ఉపేందర్ గుప్త, లయన్స్ క్లబ్ సభ్యులు జె.మురళీకృష్ణలు ముందుకు వచ్చారు. శ్రీనివాస్ ఇద్దరు పిల్లల చదువుల నిమిత్తం రూ.20వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా పుల్లూరి ఉపేందర్ గుప్త మాట్లాడుతూ బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తూ, వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా తీగల శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆయన పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు, నూతన వస్త్రాలు, నగదును తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేమని వివరించారు. దాతల నుండి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోకుండానే తన సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. పేదలకు సేవ చేయడం తనకు ఇష్టమని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు పుల్లూరి చరణ్ కుమార్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పేదల కడుపు నింపుతున్న పుల్లూరి ఉపేందర్ గుప్త
తన తల్లి జ్ఞాపకార్థం పుల్లూరి ఉపేందర్ గుప్త పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ ను స్థాపించి తద్వారా హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర ఆస్పత్రిల వద్ద వందలాది మంది పేదలకు, రోగుల బంధువులకు ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నారు. దీంతో పాటు కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన వందలాది మంది స్వాములకు మండల కాలం పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ పుల్లూరి ఉపేందర్ గుప్త చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు ఆయనకు సేవా పురస్కార అవార్డులను సైతం అందజేశాయి. పుల్లూరి ఉపేందర్ గుప్త సేవలను పలువురు కొనియాడారు.