ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: తీన్మార్ మల్లన్న

- Advertisement -

ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: తీన్మార్ మల్లన్న

యువతే దేశ భవిష్యత్తు.. విద్య, వైద్యానికి 40 శాతం బడ్జెట్ కేటాయించాలి

అందరికీ ఉచిత విద్యే లక్ష్యం.. ప్రైవేట్ విద్యా దోపిడీపై పోరాటం కొనసాగిస్తా

రిజర్వేషన్లు తొలగించాలంటే ముందుగా కుల వ్యవస్థను నిర్మూలించాలి

సెప్టెంబర్ 17 నుంచి 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర

I will contest as an MLA from Alair: Teenmar Mallanna

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 24 (వాయిస్ టుడే):
యువతే దేశ భవిష్యత్తని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసీఐఎల్ మైదానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నర్సయ్య గౌడ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘Gen Z Adda with Mallanna’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరై విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, రాజకీయాలు, రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లు తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. విద్యార్థుల ప్రశ్నలకు మల్లన్న సూటిగా సమాధానాలు ఇచ్చారు.

విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వ బడ్జెట్‌లో 40 శాతం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఉచిత విద్య అందించడమే తమ పార్టీ విధానమని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రిజర్వేషన్లపై మాట్లాడుతూ.. సమాజంలో కుల వ్యవస్థ కొనసాగుతున్నంతకాలం రిజర్వేషన్ల అవసరం ఉంటుందని అన్నారు. రిజర్వేషన్లు తొలగించాలంటే ముందుగా కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని పేర్కొన్నారు. యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక న్యాయం సాధించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

తన రాజకీయ, ప్రజా ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు మల్లన్న ప్రకటించారు. యువత సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular