ఎంపి కోమటిరెడ్డి
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కోమటి రెడ్డి హోం గార్డు రవీందర్ మృతిపై స్పందించారు. హోమ్ గార్డ్ రవీందర్ మరణించడం దురదష్టకరం, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎక్కడైనా వ్యవసాయానికి 15 గంటల కరెంట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావుకి సవాల్ చేస్తున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి అసంతృప్తి లేదు కానీ కెసిఆర్ ప్రభుత్వం పై ఉంది. ఈ 17న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి. కెసిఆర్ నీ ఇంటికి పంపేందుకు కొంగర కొలాన్ మీటింగ్. కర్ణాటక తరహాలో తెలంగాణలోను సోనియా గాంధీ ప్రకటన చేస్తారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది అని కెసిఆర్ చెప్పాడు. నేడు బి ఆర్ ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో 400లతొ సమానం. పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుంది. ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కెసిఆర్ ఎదుకు ఇవ్వలేదని అయన ప్రశ్నించారు.
నల్గోండ సీటు వదులుకోవడానికి రెడీ: కోమటిరెడ్డి
సిద్దిపేట : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. సామాజిక సమీకరణాలలో బాగంగా అవసరం అయితే నేను నల్గొండ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి రెడీ అని అన్నారు. సామాజిక సమీకరణాలలో బాగంగా టికెట్ల కేటాయింపులపై మాట్లాడటానికి ఠాక్రే నా దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన తరువాత ఎలా ఉంటుందో చూడండి. స్టార్ క్యాంపెయినర్ గా నా పని నేను చేస్తా. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదేదో రాస్తున్నారు..నాకు ఎవరిపై అసంతృప్తి లేదని అన్నారు.