Saturday, February 7, 2026

బీసీలకు బీఫామ్ లు ఇవ్వకపోతే మూడు పార్టీలకు మూడినట్టే : జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

- Advertisement -

బీసీలకు బీఫామ్ లు ఇవ్వకపోతే మూడు పార్టీలకు మూడినట్టే
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుందో స్పష్టంగా ప్రకటించాలి
బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పించని పార్టీలు బీసీ  ద్రోహులు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్ జనవరి 31

If BCs are not given beef forms, it will be like three parties: Jajula Srinivas Goud’s demand
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ లు, కార్పొరేటర్లుగా కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి లు మూడు పార్టీలు బీసీలకు బీఫామ్ ఇవ్వకపోతే ఆ పార్టీలకు ముడినట్టేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేడు తీవ్రంగా హెచ్చరించారు    నేడు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో లోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాంపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు   ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తుంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష టిఆర్ఎస్ , బిజెపి పార్టీలు కూడా ఎన్నికలకు సై అంటున్నాయని, పార్టీల పరంగా నైనా బీసీలకు జనాభా దామరస్ ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఏ పార్టీ కూడా ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. జనరల్ స్థానాలలో ఇప్పటికే నామినేషన్ వేసిన బీసీలకు బీఫాం లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జనరల్ స్థానాలు అంటే  రెడ్డి, రావులవి మాత్రమే కావని జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని ఆయన తెలిపారు. బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో బీఫామ్ లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయని, సర్వేల పేరుతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.   బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టమైన తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని, లేనిపక్షంలో బీసీ ద్రోహుల పార్టీలుగా చరిత్రలో మిగిలిపోతారని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.ఈ సందర్భంగా బీసీ సామాజిక వేదిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో ఓయు ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్, చలమల్ల వెంకటేశ్వర్లు డాక్టర్ పరంధాములు బీసీ విద్యార్ది సంఘాల నాయకులు డాక్టర్ వట్టికుటి రామారావుగౌడ్, డాకర్ సాంబశివగౌడ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, జాజుల లింగంగౌడ్, స్వామిగౌడ్,నాగేశ్వరరావు, ఆర్ ఎల్.మూర్తి, సైదులు యాదవ్, దునుకు వేలాద్రి, డాక్టర్ జీవన్ మరియు విద్యార్ది నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్