Sunday, September 8, 2024

కాంగ్రెస్ వస్తే కరంటు ఉండదు…భూములు ఎడారులైతయి

- Advertisement -

కాంగ్రెస్ వస్తే కరంటు ఉండదు…భూములు ఎడారులైతయి

కరంటియ్యక నీల్లియ్యక కన్నీల్లు మిగిల్చిండ్రు

స్వరాష్ట్రంలో నిరంతర కరంటు, పుష్కలంగా నీల్లతో పుష్కలంగా పంటలు

పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి

ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌
జగిత్యాల
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంటలకు మూడు గంటల కరంటు ఇస్తమంటున్నరు…ఎవుసంకు మూడు గంటల కరంటు సరిపోతదా…పంటలు ఎండిపోతయి…మన భూములు ఎడారులవుతయి…రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని, 24 గంటలు ఉచిత కరంటు, పంట పెట్టుబడి సాయం, సాగు నీరందించిన సీఎం కేసీఆర్‌ వెంటే ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌ అన్నారు.  జగిత్యాల మండలంలోని తిమ్మాపూర్‌, రఘురాములకోట, లక్ష్మీపూర్‌, గుట్రాజ్‌పెల్లి, గుల్లపేట, అనంతరం గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్‌ దావ వసంతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పనిచేసే ప్రభుత్వం వెన్నంటి నడువాలని, కారు గుర్తుకు ఓటు వేసి జగిత్యాల ఎమ్మెల్యేగా రెండో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ సీఎం కాకంటె ముందు, సీఎం అయిన తర్వాత ఎట్లుందో చూడాలన్నారు. రాష్ట్ర అభివృద్ది సంక్షేమమైనా, ప్రత్యేక రాష్ట్ర సాధన అయినా కేసీఆర్‌తోనే సాధ్యమయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలకులు తాగు నీరు, సాగు నీరియ్యక ప్రజలు, రైతులకు కన్నీల్లు మిగిల్చారన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ అందించి, సాగు నీరు అందించి, పంటలకు పెట్టుబడి సాయమందించడంతో నేడు రాష్ట్రంలో విపరీతంగా పంటలు పండుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేసిన సీఎం రైతులకు రైతు బంధు, బడులను బాగు చేసి ఇంగ్లీష్‌ మీడియం, గురుకులాలు, హాస్టల్లు, స్కూల్లలో సన్నబియ్యంతో మద్యాహ్న భోజనాన్ని అందించి విద్యార్థులకు విద్యార్థి బంధు, కళ్యాణలక్ష్మీ బీడీ పింఛన్‌, ఒంటరి మహిళలకు పించన్‌ అందిస్తూ మహిళా బంధుగా మారాడన్నారు. మాది పనిచేస్తున్న ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్న ప్రచారాలను నమ్మి మోసపోవద్దన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ చాలని రేవంత్‌రెడ్డి, కర్ణాటకలో మాదిరిగా ఐదు గంటలిస్తమని కర్ణాటక కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేస్తున్నరని, కాంగ్రెస్కు ఓటు వేసి అధికారాన్ని కట్టబెడితే కరంటు ఉండదని, పంట పొలాలతో పచ్చగా మారిన మన భూములు మల్లా ఎడారిగా మారుతాయన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చేర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సంపదను సృష్టిస్తూ పేదబడుగుబలహీన వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నారని, సంపదను పెంచుకోవడం…సహచరులకు దోచిపెట్టడం జీవన్‌రెడ్డి నైజమన్నారు. ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డికి ఊర్లను, రోడ్లను, చెరువులను బాగు చేద్దామనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. లక్ష్మీపూర్‌ చెరువును బాగు చేయడంతో నేడు నీటితో నిండు కుండలా మారిందని, రూ. 5కోట్లతో లక్ష్మీపూర్‌లో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి రూ. 20లక్షలు మంజూరు చేయించామని మరి జీవన్‌రెడ్డి ఎందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు. ఆడబిడ్డల పెండ్లికి వచ్చి భుజాలమీద చేయివేసి పోవడమే కాని ఏ రోజైనా జీవన్‌రెడ్డి రూపాయి సాయం చేసిండా అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే జీవన్‌రెడ్డి తాపత్రయమని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ అన్ని విధాలా అభివృద్ది చేశారని, అన్ని వర్గాలకు సంక్షేమ పలాలు అందించారని, నియోజకవర్గంలో ఓట్లడిగే హక్కు ఒక్క ఎమ్మెల్యే డా. సంజయ్‌కే ఉందన్నారు. 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి డా. సంజయ్‌ కుమార్‌ను రెండో మారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఊరూరా ఘన స్వాగతాలు….

ఎన్నికల ప్రచారానికి వెల్లిన ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌కు ప్రజలు గ్రామగ్రామాన బ్రహ్మరథం పట్టారు. ఆదివారం దీపావలి పండుగ రోజున జగిత్యాల మండలంలోని తిమ్మాపూర్‌, రఘురాములకోట, లక్ష్మీపూర్‌, గుట్రాజ్‌పెల్లి, అనంతారం, గుల్లపేట గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రజలు సైతం భారీగా తరలివచ్చారు. డప్పు చప్పుల్లతో నృత్యాలు, చేస్తూ బతుకమ్మలు ఆడుతూ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.ఆనంతరం జడ్పీ చైర్పర్సన్‌ దావ వసంత సైతం లక్ష్మీపూర్‌లో మహిళలతో కలిసి నృత్యాలు చేసి వారిలో హుషారు నింపారు.
ఈ కార్యక్రమంలో దామోదర్ రావు, ముసుకు ఎల్లారెడ్డి, బాల ముకుందం ,దావ సురేష్,మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,చెరుకు జాన్,రాజీ రెడ్డి,మధు
గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్లు గ్రామ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్