
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు హామీ
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీల పరిధిలోని చిరు వ్యాపారస్తులకు అండగా నిలిచి,తై బజార్ రద్దు చేస్తామని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు హామీ ఇచ్చారు.. గురువారం పట్టణంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో పట్టణ చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు షాహిద్ మహమ్మద్ షేక్ అధ్యక్షుతన చిరు వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు హాజరై ఆయన మాట్లాడుతూ కోరుట్ల, మెట్ పల్లి రెండు మున్సిపాలిటీల పరిధిలో చిరు వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేస్తూ తైబజార్ పేరున అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వెంటనే ఈ తైబజార్ విధానం రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.. కోరుట్లలో గతంలో జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 10 సంవత్సరాలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నారు. కేవలం తన కుటుంబ అభివృద్ధి కోసం తన కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడం కోసమే తన పదవి కాలం అంతా గడిపారన్నారు.. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.. చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు.. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లాడని గతంలో జువ్వాడి రత్నాకర్ రావు మంత్రిగా పనిచేసిన కాలంలో కోరుట్ల నియోజకవర్గం లో నిర్మించినన్ని ఇండ్లు తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో కూడా నిర్మించలేదన్నారు. ఆ సమయంలో కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచిందని, కానీ నేడు 119 నియోజకవర్గాల్లో కోరుట్ల చిట్టా చివరి స్థానంలో ఉందన్నారు.. నియోజకవర్గ అభివృద్ధిలో చివరి స్థానానికి చేరుకోవడానికి కారకులు ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అసమార్థతనే కారణమన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు షాహిద్ మహమ్మద్ షేక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నయీమ్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరు వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు


