రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
If farmers are disturbed, strict action will be taken
—–మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
—-
రేపల్లివాడ జిమ్మింగ్ మిల్లు అకస్మిక తనిఖీ
—-
రైతులను అడిగి సమస్యలు ఆరా
—
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ
తాండూర్
తమ పంటలను అమ్మకానికి తెచ్చిన రైతులను వివిధ కారణాలు చెబుతూ ఇబ్బంది పెడితే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం తాండూర్ మండలం పరిధిలోని రేపల్లె వాడలో గల శ్రీరామ, మహేశ్వరి పత్తి జిమ్మింగ్ మిల్లును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిమ్మింగ్ మిల్లులోని రికార్డులను తనిఖీ చేసి అక్కడ సిబ్బంది ద్వారా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందించాల్సిన సేవలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యలను కలిగి తెలుసుకున్నారు. అక్కడి రైతులు చెప్పుకున్న పలు సమస్యలను నోట్ చేసుకొని, త్వరలోనే మీ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన రాకతో జిమ్మింగ్ మిల్లు సిబ్బంది, తాండూరు మండల అధికారులు పలువురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిన్నింగ్ మిల్లు పర్యటన అనంతరం నేరుగా మండలంలోని తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో కుమార్ దీపక్ పలువురికి సూచనలు చేస్తూ , సుతి మెత్తగా హెచ్చరికలు చేస్తూ ఆయన పర్యటన అధ్యంతం కొనసాగింది. ఊహించని కలెక్టర్ పర్యటన ముగియడంతో అటు అధికారులు, ఇటు
జిన్నింగ్ మిల్లు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆయన వెంట పాల్గొన్నవారు ఏమర్వో ఇమ్రాన్ ఖాన్,డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్,ఆర్ఐ అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.