Sunday, December 22, 2024

అవకాశమిస్తే సత్తెనపల్లిలో అంబటిని ఓడిస్తా…

- Advertisement -

హైదరాబాద్ లో  ‘బ్రో’ సక్సెస్ మీట్  

వపన్ కల్యాణ్ తాజా చిత్రం ‘బ్రో’ అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాస్పదమయింది. దీనిపై అంబటి కూడా విమర్శలు గుప్పించారు. అదే స్థాయిలో అంబటికి పృథ్వి కౌంటర్ ఇచ్చారు. అవకాశమిస్తే సత్తెనపల్లిలో అంబటిని ఓడిస్తానని ఆయన అన్నారు.

If given a chance, I will defeat Ambati in Sattenapally...
If given a chance, I will defeat Ambati in Sattenapally…

మరోవైపు ఈరోజు హైదరాబాద్ లో ‘బ్రో’ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ… పృథ్వీగారు ఎందుకండీ మీ క్యారెక్టర్ ఇంత వైరల్ అయింది? అని అడిగారు. దీనికి సమాధానంగా సినిమాలో మంచి ఉందని, హ్యూమన్ వాల్యూస్, ఎమోషన్స్ ఉన్నాయని చెప్పారు. ఎంత సంపాదించినా చివరకు మట్టిలోకే వెళ్లాలని చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని అన్నారు. తాను పోషించిన శ్యాంబాబు పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని చెప్పారు.

ఏంటండీ మీ సినిమాలో ఏపీ మంత్రిని కించపరిచేలా చేశారట అని కొందరు తనతో అన్నారని… ఆ మంత్రి అంబటి రాంబాబు అని చెప్పారని… వెంటనే తాను అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చానని పృథ్వీ అన్నారు. తెలియని వాడి గురించి సినిమాలో తానెందుకు చేస్తానని చెప్పానని తెలిపారు.

ఈ సినిమాలో తనది ఒక బాధ్యత లేని పనికిమాలిన వెధవ క్యారెక్టర్ అని… బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చెప్పారు. దర్శకుడు సముద్రఖని చెప్పిన క్యారెక్టర్ కు తాను న్యాయం చేశానని… అంబటి రాంబాబు క్యారెక్టర్ కు న్యాయం చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తన పాత్ర గురించే టాక్ నడుస్తోందని చెప్పారు. మధ్యలో సినిమాలు వదిలి బయటకు వెళ్లిన తాను… మళ్లీ వచ్చి చేసిన సినిమా ఇదని చెప్పారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో తనకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్