- Advertisement -
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఎల్బీ స్టేడియంలో జరిగిన నరేంద్రమోదీ సభకు హాజరు కాని రాజాసింగ్.. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభను కార్యకర్తలతో కలిసి నేను కూడా టీవీలో చూసినా.. నరేంద్రమోదీ, బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను టీవీలో చూడటం నాకు బాధగా ఉంది. సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం నా గోషామహల్ నియోజకవర్గంలో ఉంది.. నేను ఇప్పటికే నామినేషన్ వేసినా.. ఆ సభలో నేను పాల్గొంటే ఆ సభ ఖర్చు మొత్తం నా ఖాతాలో రాసే అవకాశం ఉంది.. ఈ అంశంపై నేను , నా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడినం.. వారు కూడ అదే చెప్పారు.. మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వివరించారు.. దీనితో నేను సభకు హాజరు కాలేదు.. మా గురువు నరేంద్రమోదీ పాల్గొనున్న సభలో నేను పాల్గొనలేకపోవడం బాధగా ఉంది.
- Advertisement -