కేసీఆర్ ఎన్నికయితే, మీ భూములు గుంజుకుంటడు: రేవంత్ రెడ్డి

- Advertisement -

దోమకొండ:  పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతుండు. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదు.

సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగిండు. ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండు. ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిండు. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటడని అన్నారు.

కేసీఆర్ ను నమ్మదమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే. కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడు. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా. కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ అన్నారున.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular