Monday, March 24, 2025

3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి

- Advertisement -

3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి
విజయవాడ, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)

If not three thena foot 30 chases

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రెడ్ బుక్ చూడలేదు అని, అందులో తన పేరు ఉందో లేదో తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారుమాజీ సీఎం జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన సమయంలో కొడాలి నాని సైతం జైలు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ ప్రభుత్వం కాబట్టి యాక్టివ్ గా మాట్లాడాం, ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి (ఎమ్మెల్యేలుగా ఓడిపోయాం) ఇంకేం మాట్లాడతాం?. ఈ అరెస్టులు ఇవన్ని చాలా చిన్న విషయాలన్న కొడాలి నాని, తమ మీద 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారువిజయవాడ జిల్లా సబ్ జైల్ లోపలికి మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు కొడాలి నాని, పేర్ని నానికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నేటి ములాఖత్ లో వల్లభనేని వంశీని జైలులోకి వెళ్లి పరామర్శించేందుకు అనుమతి నిరాకరించారు. మాజీ సీఎం జగన్ తో కలిసి జైల్లోకి వెళ్లేందుకు సింహాద్రి రమేష్ ను అనుమతించారు. అయితే ములాఖత్ లో వంశీని కలిసేందుకు జగన్ తో పాటు పేర్ని నాని, కొడాలి నాని పేర్లు ఇచ్చినట్లు సమాచారం. కానీ సెక్యూరిటీ కారణాలతో కొడాలి నాని, పేర్ని నానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.వైసీపీ ఐదేళ్ల పాలలో తప్పు చేసిన వారి పేర్లను తన రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నానని గతంలో నారా లోకేష్ పలుమార్లు అన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు లోకేష్ మాటల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో వైసీపీ ఘోర పరాజయం, అద్భుత విజయంతో కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అక్రమ కేసులపై ఫోకస్ చేస్తున్నాం.. వారి అవినీతిని బయటకు తీస్తామని నారా లోకేష్ సహా టీడీపీ అన్నారు. ఈ క్రమంలో ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది కొడాలి నానినే అని, రెడ్ బుక్ లో ఆయన పేరు ఉందని టీడీపీ నేతలు వైరల్ చేశారు. త్వరలోనే నారా లోకేష్ రెడ్ బుక్ లో కొడాలి నాని పేరు తీస్తారని, మాజీ మంత్రి అరెస్ట్ తప్పదని కూటమి నేతలు చేసిన కామెంట్లపై తాజాగా ఆయన స్పందించారు. తనకు ఏ రెడ్ బుక్ గురించి తెలియదని, తన పేరు ఉందో లేదోనన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్