Sunday, September 8, 2024

రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరగగలవా.?

- Advertisement -

రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరగగలవా.?

If Rahul dares, can he go to OU?

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్
బీజేపీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి నేను సవాల్ చేస్తున్నా. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా. ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించి బీజేపీకి 8 ఎంపీ సీట్లు అందించి తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయం అని తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజలకు ఇదే నా సెల్యూట్’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశానికి వచ్చిన వారితో కలిసి లేచి నిలబడి ‘తెలంగాణ ప్రజలకు సెల్యూట్’ చేశారు. శంషాబాద్ సమీపంలోని మల్లికా కన్వెన్షన్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్త్రత కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ 3వ సారి మోదీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరాని బంధముంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మణ్ ఆధ్వర్యంలో 4 ఎంపీ సీట్లను అందించారు. మొన్నటి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని నిరూపించారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా అన్నింటినీ భరిస్తూ, తెగిస్తూ పోరాడుతున్నందునే బీజేపీపట్ల తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను చూసి మోసపోయారని తెలుసుకున్న ప్రజలు 8 ఎంపీ సీట్లు గెలిపించి మోదీకి పట్టం కట్టారు. ఎంపీ ఎన్నికల్లో  జవాన్ ను అడిగినా, మహిళలను అడిగినా, చివరకు సామన్య ప్రజలను ఎవరిని అడిగినా ‘మోదీ’యే మాకు గ్యారంటీ అని చెబుతున్నారు. వార్డు మెంబర్ నుండి ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా మోదీయే గ్యారంటీ అని చెబుతూ బీజేపీకి ఓటేశారు.
మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ఈ దేశానికి గ్యారంటీ మోదీయేనని నిరూపించారు.  మోదీ స్పూర్తితో తెలంగాణలోనూ రామరాజ్యం రావాలని ప్రజలు భావిస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు మరువలేనివి. ఎన్ని కేసులు ఎదురైనా తెగించి కొట్లాడారు. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మోదీ సంక్షేమ పథకాలను, విజయాలను వివరించి పనిచేశారు. కార్యకర్తల కష్టార్జితంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు తమ భుజంపై కాషాయ జెండాను మోశారు. వారందరికీ నా సెల్యూట్
తెలంగాణలో కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండాలని ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.
ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే… ఈ దేశ ప్రజల బతుకులు బాగుపడాలంటే మోదీయే ప్రధానిగా ఉండాలని బీజేపీకి ఓటేశారు.. ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి రాబోయేది బీజేపీ మాత్రమేనని ఘంటాపథంగా చెబుతున్నా.
కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో దారుణంగా మోసం చింది. రైతులను మోసం చేసింది. మోదీ ఇచ్చిన మాట తప్పని వ్యక్తి. ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు. కనీస మద్దతు ధర పెంచారు. సబ్సిడీలపై ఎరువులను పంపిణీ చేస్తున్నారు.
నేను ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా. మీకు దమ్ముంటే ఉస్మానియా వర్శిటీకి వెళ్లి నిరుద్యోగులను కలిసి మాట్లాడగలరా? అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో నిరుద్యోగం ఏ విధంగా అంటువ్యాధిలో వ్యాపిస్తుందో, కాంగ్రెస్ గెలిచి 7 నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిది. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసినా, రాజ్యాంగాన్ని మార్చేస్తారని అబద్దాలను ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోకుండా నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టారు. మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్