రాహుల్ గాంధీకి సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలి
హైదరాబాద్
If Rahul Gandhi has any shame or decency, he must answer for the party defections.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇండ్లు కోల్పోయిన పేదలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? రియల్ ఎస్టేట్ మాఫియాలా పేదల భూములను దోచుకుంటూ, వేలకోట్ల కాంట్రాక్టులను నీ కొడుకుకు కట్టబెడుతూ.. ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల్లా తింటున్న నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి పొంగులేటీ అని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిమీద సమగ్ర విచారణ జరిపిస్తాం. న్యాయం జరిగే వరకు ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన ఇళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు, వాళ్లకి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టేవరకు మిమ్మల్ని వదిలిపెట్టమని అన్నారు.
ఖమ్మంలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ మంత్రుల బినామీలు సురేష్, దామోదర్ రావు, కిషోర్. వెలుగుమట్లలో ఉన్న భూదాన్ భూములను దోచుకోవడానికే పేదల ఇండ్లను కూల్చివేశారు. ఒక శత్రుదేశం మీదకి పోయినట్లు అర్ధరాత్రి 3 గంటలకు 3000 మంది పోలీసులు పోయి, పేదలను మెడలు పట్టుకొని బయటకు తోసి ఇండ్లను కూల్చేశారు. పనికిమాలిన కాంగ్రెస్ మంత్రులు చెప్తే ఇండ్లు కోల్పోయిన వెలుగుమట్ల బాధితులపై ఏసీపీ కేసులు పెట్టాడు. ఆయన అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా అని ప్రశ్నించారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులపై కేసులు ఎలా పెడుతారు? వాళ్లకి భోజనం పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇండ్లు కోల్పోయిన కొందరు బాధితులకు పట్టాలు ఇచ్చారంటే.. ఇండ్లు కూల్చి తప్పు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్లే. కాబట్టి వెంటనే తప్పుడు కేసులు బనాయించామని ఒప్పుకొని, క్షమాపణలు చెప్పి, కేసులు విత్ డ్రా చేసుకోవాలి.
రాహుల్ గాంధీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఇప్పటివరకు ఏ స్పీకర్ తీసుకోలేదు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ చేస్తున్న బహిరంగ దాడి ఇది. రాహుల్ గాంధీకి సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలని అన్నారు.



