ఈ నెల 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తాం
రైతుబంధు పూర్తిగా అమలు చేయకుంటే.. తాను ముక్కు నేలకు రాస్తా
నెల 9న కెసిఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలి
లేకుంటే కెసిఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు
కొత్తగూడెం మే 4
;రైతు బంధుపై కెసిఆర్ కు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 8వరకు రైతుబంధు వేస్తే.. కెసిఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… ఈ నెల 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తామని చెప్పారు.మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతబంధు డబ్బులు జమ చేశామని, నాలుగు లక్షల మందికీ ఈ నెల 8 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 9న కెసిఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, రైతుబంధు పూర్తిగా అమలు చేయకుంటే.. తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కెసిఆర్ ముక్కు నేలకు రాస్తావా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
రైతుబంధు పూర్తిగా అమలు చేయకుంటే.. తాను ముక్కు నేలకు రాస్తా
- Advertisement -
- Advertisement -