పాఠశాలల్లో సౌకర్యాలు అన్ని ఉంటే గేట్లకు తాళాలు ఎందుకు ?

- Advertisement -

పాఠశాలల్లో సౌకర్యాలు అన్ని ఉంటే గేట్లకు తాళాలు ఎందుకు ?

If schools have all the facilities then why locks on the gates?

ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన…
రాక్షస పాలన
మాజీ

* జడ్పీ చైర్పర్సన్ దావ వసంత- సురేష్*

జగిత్యాల,
:పాఠశాలల్లో సౌకర్యాలు అన్నీ ఉంటే గేట్లకు తాళాలు వేసే పరిస్థితి ఎందుకు వస్తుందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ- వసంత ప్రశ్నించారు.ఆదివారం
బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుండి సేకరించిన సమస్యలపై
జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాట్లాడుతూ గురుకుల బాట కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తును చూస్తుంటే అందకారమే కనబడుతుందన్నారు. గురుకుల పాఠశాలల్లో మౌళిక వసతులైన పరిశుభ్రత కొరవడిందని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని దాంతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని పాఠశాలకు వెళ్తే గేట్లకు తాళాలు వేసి మమ్ములను లోనికి రానీయలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రైతులకు, విద్యార్థులకు రక్షణ లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు రక్షణగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని విజయోత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. గురుకుల పాఠశాలల్లో 50 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు.గత ఎన్నికల హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఉచిత బస్సులు వద్దంటే మానేస్తామని ఓ మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది రాక్షస పాలనగా కనిపిస్తుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి దానిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో విద్యార్థులను అక్కడి నుంచి సౌకర్యాలు ఉన్న మల్యాల ప్రాంతానికి తరలించారన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్సీవి నాయకులు జక్కుల వెంకటేష్ ,మంతెన మధు రాజేష్,వెంకటేష్,శ్యామ్, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular