- Advertisement -
శ్రీశైలం పోతే పుణ్యం తో పాటు లాఠీల “దెబ్బలు
శ్రీశైలం
శ్రీశైలం దేవస్థానంలో శివ స్వాముల పై లాఠీలతో దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో శివ స్వాముల పై పోలీసుల దాడి వీడియోలు వైరల్ అయ్యాయి. ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో శ్రీశైలంలో గందరగోళం ఎర్పడింది. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులను గంటల కొద్ది క్యూలో సిబ్బంది నిలిపివేసారు. సిబ్బంది నిర్వహణ లోపంతో ఒక్కసారిగా దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో భక్తులు, శివస్వాములపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
- Advertisement -


