దేశం సురక్షితంగా ఉండాలంటే మరొక్క సారి మోడీ సర్కార్ రావాలని యావత్ భారత దేశ ప్రజలు అంటున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు..
కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశ తిలక్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన రక్షణ శాఖ మంత్రితో విశ్రాంత సైనికుల ఆత్మీయ సమ్మేళనానికి రాజనాధ్ సింగ్ అనివార్య కారణాలతో రాలేక పోయారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆర్మీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రిటైర్డ్ సైనికులకు వన్ నేషన్ వన్ ఫెన్షన్ తీసుకు వచ్చారని తెలిపారు. గతంలో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చిందంటే అది నరేంద్రమోదీ చేసిన కృషి పలితమేనని అన్నారు..ఈ సారి నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తే ప్రపంచంలో మూడో స్థానంలోకి వస్తుందని స్పష్టం చేశారు. గతంలో భారత దేశాన్ని పట్టించేకునే వారే లేరు. కానీ నేడు ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుంది, దేశాల మధ్య యుద్ధాల నివారణ కోసం సైతం మన మోడీని ఆశ్రయిస్తున్నారంటే ఇది మన భారతీయులందరికీ గర్వకారణమని వెల్లడించారు.