Saturday, February 21, 2026

పోలీసులు మారకపోతే మంథని నుంచే ప్రళయం మొదలవుతుంది-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

- Advertisement -

పోలీసులు మారకపోతే మంథని నుంచే ప్రళయం మొదలవుతుంది
 -నేపాల్‌ ప్రభుత్వం ఆంక్షలు పెడితే ఏం జరుగుతుందో గమనించాలే
-మంథనిలో నేపాల్‌ పరిస్థితి పునరావృతం కాకుండా పోలీసులు మారాలి
-పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చింది బారత రాజ్యాంగమని గుర్తించాలే
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
మంథని

If the police do not change, the disaster will start from Manthani itself - Former Manthani MLA Putta Madhukar

రాజకీయ పార్టీలను, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో మంథని నియోజకవర్గంలో పోలీసులు మారక పోతే మంథని నుంచే ప్రళయం మొదలు అవుతుందనిమంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ హెచ్చరించారు. గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని,దుద్దిళ్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలను చూపించడం పరిపాటిగా మారిందన్నారు.  పోలీసుల్లో ఎస్సీలు, బీసీలు ఉన్నారని, వాళ్లను వాడుకుని కరివేపాకులా పడేయడం ఖాయమన్నారు. . రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21నెలలు గడుస్తున్నా 420హమీలకు మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే యూత్‌,మహిళా రైతు డిక్లరేషన్‌ల గురించి ఆలోచన చేయడం లేదన్నారు. వృద్దులు వికలాంగుల పించన్‌ పెంపు కోసంఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. అయితే సోషల్‌ మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తోందని, ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేశారన్నారు. ఇలాంటిదే నేపాల్‌లో యువత మా ఆకలి తీర్చాలని ఆలోచన
చేయడం లేదని, మా ఆశీస్సులతో విలాసాలు గడుపుతున్నారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటుందో మనం చూస్తూనే ఉన్నామనిఅన్నారు. అలాంటి పరిస్థితి మంథనిలో పునరావృతకాకుండా పోలీసులు, ప్రభుత్వం, ముఖ్యంగా మంథని ఎమ్మెల్యే కళ్లు తెరువాలన్నారు.  ప్రస్తుతం 21నెలలు గడిచినా ఈప్రాంతంలో 21కార్యక్రమాలు చేయలేదని, 21మందికి ఉద్యోగాలు ఇప్పించలేదనివిమర్శించారు.అయితే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు పెడుతున్నారని, నల్లబాలు అలియాస్‌ శశిధర్‌ అనే వ్యక్తి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పాలన రాష్ట్రానికి చీడపురుగులాంటిదని వ్యాఖ్యానిస్తే అతనిపై కేసులు పెట్టి అరాచకం చేసిండ్లనితెలిపారు. ఈ విషయంలో హైకోర్డు ఆ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందని, తొమ్మిది రాష్ట్రాల్లో కేసులను పరిశీలిస్తే కేసులన్నీ కానిస్టేబుళ్లు ఎఫ్‌ఐఆర్‌ చేస్తున్నారని తేలిందని ఇది అవమానకరమని హైకోర్డు వెల్లడించిందన్నారు.  అంతేకాకుండా ఎవరిమీదనైతేఆరోపణలు చేస్తరో ఆ వ్యక్తి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు. హైకోర్డు తీర్పు వెలువరించిన క్రమంలో మంథని పోలీసుల్లో మార్పు రావాలన్నారు. బారత రాజ్యాంగం మాత్రమే మీకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమో
రేవంత్‌రెడ్డో దుద్దిళ్ల శ్రీధర్‌బాబో మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని విషయాన్ని గుర్తించాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడు గొప్పగా ఆలోచన చేసి రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తులు,భూములు చదువు ఉన్నవాళ్లకే ఓటు హక్కుఇచ్చేదన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్లకు ఒక్కశాతం కూడా మంథని ఎమ్మెల్యే పని చేయలేదని ఆయన విమర్శించారు. నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే మంచి పదవులు వస్తాయే కానీ పోలీసులుజైలుకు పోతే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గమనించాలన్నారు.  ఈనాడు యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారని, యూరియా బస్తాలను కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చి రైతులను గోసపెడుతున్న దుద్దిళ్లపై కేసుపెట్టాలన్నారు.ఆనాడు ఆడవాళ్ల మీటింగ్‌లకు పోయి బెల్ట్‌షాపులు బంద్‌ చేయిస్తం, 500బోనస్‌ ఇస్తమని, అవసరమైతే సోనియమ్మదగ్గరకు పోతామని గొప్పలు చెప్పుకున్నారని, వాటిని అమలు చేయడంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఈసమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు యెగోళపు శంకర్ గౌడ్,తగరపు శంకర్ లాల్, మాచిడి సత్యనారాయణ గౌడ్, కనవేన శ్రీనివాస్ యాదవ్,గోబ్బూరి వంశీ, మంథని లక్ష్మన్,వేల్పుల గట్టయ్య, అసిఫ్ ఖాన్,జవేద్, మబ్బు నాగరాజు లతో పాటు
పలువురు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్