హామీలు నెరవేర్చకపోతే…ప్రజా ఉద్యమాలే
కేటీఆర్
రంగారెడ్డి
కూకట్పల్లి లోని ఎన్కేఎన్నార్ గార్డెన్స్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు తదితరులు హజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తున్నదని అన్నారు. తాము వంద రోజుల పాటు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఫ్రీ బస్ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ సరైనన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయటం వల్ల బస్సులతో ప్రయాణించే మహిళలు, పురుషులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోజు వరకు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదివేల రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు.
హామీలు నెరవేర్చకపోతే…ప్రజా ఉద్యమాలే
- Advertisement -
- Advertisement -