దిల్లీ: రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయొద్దని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలుకు సంబంధించిన గ్లోబల్ వర్క్‌షాపులో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నాణ్యమైన సేవలు అందించకుంటే, టోల్ వసూలు చేయొద్దు. మనం టోల్ వసూలుమీద చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ నాణ్యమైన రోడ్లు ఉన్నచోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలూ, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తామంటే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది’ అని గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తొలిగా 5వేల కి.మీ పరిధిలో జీఎన్‌ఎస్‌ఎస్(గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్) ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ పరిధిలోనే ఇది పనిచేస్తుంది. మొదట్లో దీన్ని హైబ్రిడ్ విధానం (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్-ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత, జీఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత)లో అమలు చేస్తారు.
రోడ్లు బాగోకపోతే టోల్ వసూలుచేయద్దు
Published By Voice Today Team
958

- Advertisement -
- Advertisement -
- Tags
- nitin gadkari
- nitin gadkari bjp
- nitin gadkari exclusive
- nitin gadkari exclusive interview
- nitin gadkari interview
- nitin gadkari ka video
- nitin gadkari latest
- nitin gadkari latest interview
- nitin gadkari latest news
- nitin gadkari latest speech
- nitin gadkari latest video
- nitin gadkari live
- nitin gadkari news
- nitin gadkari oath
- nitin gadkari on bjp
- nitin gadkari speech
- nitin gadkari video
- nitin gadkari viral video
- union minister nitin gadkari



